చిరంజీవి బర్త్ డే వేడుకలు నిన్న(ఆగస్ట్ 22) అభిమానులు ఘనంగానే జరుపుకున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా ఇంటిదగ్గరే ఉండి అందరినీ కలిశారు. అభిమానులు, సినీ పరిశ్రమ పెద్దలు అందరూ ఇంటి దగ్గరికి వెళ్ళి విష్ చేసారు.
అయితే బర్త్ డే వేడుకల్లో హైలెట్ గా నిలిచింది మాత్రం మెగాస్టార్ చెల్లెలు విజయ దుర్గ. ఆవిడ తన కొడుకు సాయిధరమ్ తేజ్ తో కలిసి వచ్చి అన్నయ్య కు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు హైలెట్ గా నిలిచింది. మనం నిన్ననే విడుదల చేసిన 'సైరా నరసింహా రెడ్డి' పోస్టర్ లో ఒక కత్తిని చూసాం. ఇది ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వాడిన ఖడ్గం అని అందరూ చెబుతారు. అయితే ఇప్పుడు అటువంటి తరహా కత్తి ఒకటి అమృత్ సర్ లో ప్రత్యేకంగా తయారుచేయించి అన్నయ్య కు బర్త్ డే కానుకగా ఇచ్చింది.
ఈ కత్తిని ఆమెతో పాటు పెద్ద కొడుకు సాయిధరమ్ తేజ్, చిన్న కొడుకు వైష్ణవ్ తేజ్ కూడా కలిసి అందించారు. చిరంజీవి ఆ కత్తిని చేతితో పట్టుకుని ఫోజులు ఇస్తుంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. గతంలో ఎక్కడైనా ఫంక్షన్స్ లో ఇలాంటివి అభిమానులు ఇస్తూ ఉండటం మనం చూస్తాం, కానీ చెల్లెలు అన్నయ్యకు ఇలాంటిది గిఫ్ట్ ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.