యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ 'అర్జున్ సురవరం' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా స్టార్టింగ్ నుండీ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ నిర్వహిస్తూ చాలా హడావిడి చేశాడు. ఇంకేముంది నిఖిల్‌కి ఈ సినిమాతో మంచి హిట్ ఖాయమనుకున్నారంతా. కానీ, ఆంగ్ల సినిమా 'అవెంజర్స్' నిఖిల్ సినిమాని దారుణంగా దెబ్బ తీసింది. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకుని, ఆశలు వదులుకునేలా చేసింది. అన్నీ కుదిరితే అప్పుడెప్పుడో రిలీజ్ కావల్సిన నిఖిల్ 'అర్జున్ సురవరం' ఎట్టకేలకు ఈ నెల 29న విడుదలవుతోంది.
ఒక్కసారి రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యిందంటే, ఆ సినిమాకి సినిమా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిఖిల్ పరిస్థితి అలాగే జరిగింది. రిలీజ్ డేట్ అయితే దొరికింది కానీ, సినిమాకి రావల్సిన హైప్ రాలేదు. దాంతో, అగమ్యగోచర పరిస్థితిలో ఉన్న నిఖిల్ సినిమాకి మెగాస్టార్ అండా దండగా నిలిచారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ ముఖ్య అతిథిగా రానున్నారట. దాంతో 'అర్జున్ సురవరం'పై అంచనాలు మళ్లీ మొదలయ్యాయి. ఆల్రెడీ సినిమా చూసిన మెగాస్టార్‌కి ఈ సినిమా చాలా బాగా నచ్చడంతో, నిఖిల్ రిక్వెస్ట్ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగం కావాలనుకున్నాడట.
సో అలా మెగా అండ దండలతో ఎలాగోలా నిఖిల్ తన సినిమాని ధియేటర్స్ వరకూ తీసుకురాగలుగుతున్నాడు. ఇక ఫైనల్ వర్డిక్ట్ ప్రేక్షకులదే. టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.