చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` తో బిజీగా ఉన్నారు. ఇది కాకుండా ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. రెండూ రీమేకులే. వేదాళం, లూసీఫర్ చిత్రాల్ని ఆయన రీమేక్ చేయబోతున్నారు. `వేదాళం` రీమేక్ బాధ్యతల్ని మెహర్ రమేష్ చేతికి అప్పగించిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్.... ఇప్పటికే స్క్రిప్టుని పూర్తి చేసేశాడు. `ఆచార్య` సెట్స్‌పై ఉండగానే `వేదాళం`ని మొదలెట్టాలన్నది ప్లాన్. చిరు కూడా `వేదాళం` రీమేక్‌నే ముందు పూర్తి చేయాలని భావించారు.
అయితే.. ఇప్పుడు చిరు ఆలోచన మారింది. `వేదాళం` కంటే ముందు.. `లూసీఫర్` ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిరు భావిస్తున్నాడట. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. ముందు వినాయక్ ని దర్శకుడిగా ఎంచుకున్నారు. కొంత వర్క్ చేశాక, ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తరవాత మోహన్ రాజా.. ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. తమిళంలో `తని ఒరువన్` తీసిన దర్శకుడు మోహన్ రాజా. అదే కథ తెలుగులో `ధృవ`గా తెరకెక్కి హిట్ కొట్టింది. మోహన్ రాజా చేతిలో కొన్ని తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి. అయినా సరే, చిరు కోసం ఆ ప్రాజెక్టుల్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.