గురువారం ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా... ఆర్.ఆర్.ఆర్ నుంచి మంచి పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్ పై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా - చాలామందికి పోస్టర్ నచ్చింది. అయితే.. ఎన్టీఆర్ కి మరో సర్‌ప్రైజ్ గిఫ్ట్ కూడా అందిందట. అది కూడా చిరంజీవి ఇంటి నుంచి. చిరంజీవి లో మంచి చెఫ్ ఉన్న సంగతి తెలిసిందే. చిరు పెసరెట్లూ, దోసెలు వేయడంలో స్పెషలిస్టు. మొన్నామధ్య నాగార్జున కోసం చేపల కూర కూడా వండాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ కోసం స్పెషల్ గా మటన్ బిరియానీ చేశాడట. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిరు ఇంటి నుంచి.. ఎన్టీఆర్ ఇంటికి మటన్ బిరియానీ వెళ్లిందని తెలుస్తోంది. ఈ గిఫ్ట్ చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయాడట. ఇటీవల ఎన్టీఆర్ కి కరోనా సోకింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ యోగ క్షేమాల్ని చిరు స్వయంగా కనుక్కున్నాడు.
అభిమానులకు కూడా ఎన్టీఆర్ క్షేమ సమాచారాన్ని అందించాడు. ఇప్పుడు ఏకంగా బిరియానీ వండి పంపాడు. నందమూరి - మెగా అభిమానులకు ఇంతకంటే సంతోషకరమైన సందర్భం ఏముంటుంది?