త్రివిక్ర‌మ్ ఊసెత్త‌ని చిరు.

By Gowthami - April 21, 2020 - 14:20 PM IST

మరిన్ని వార్తలు

చిరంజీవి - త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. చిరు - త్రివిక్ర‌మ్ కాంబోని రామ్ ఛ‌ర‌ణ్ సెట్ చేశాడు కూడా. వీరిద్ద‌రితోనూ ఓ సినిమా చేస్తాన‌ని అప్పుడెప్పుడో అభిమానుల స‌మ‌క్షంలో మాట ఇచ్చాడు చ‌ర‌ణ్‌. అయితే ఇప్పుడు ఆ సినిమా ఎక్క‌డికిపోయిందో చిరు ఫ్యాన్స్‌కి అర్థం కావ‌డం లేదు. ఈమ‌ధ్య ఓ టీవీ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న కొత్త సినిమాల‌కు సంబంధించిన విశేషాల్ని అభిమానుల‌తో పంచుకున్నాడు. ఆచార్య త‌ర‌వాత బాబి, సుజిత్‌ల‌తో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. మెహ‌ర్ ర‌మేష్ ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది. కానీ త్రివిక్ర‌మ్ ఊసెత్త‌లేదు. దాంతో ఈ సినిమాపై మ‌రోసారి నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి.

 

నిజానికి చిరు - త్రివిక్ర‌మ్ ల‌తో ఓ సినిమా చేయాల‌ని నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్‌నీ ఇన్వాల్వ్ చేశారు. చిరు, ప‌వ‌న్‌ల‌తో త్రివిక్ర‌మ్ భారీ మ‌ల్టీస్టార‌ర్ అని ఊరించారు. కానీ.. ఆ సినిమా సైడ్ కి వెళ్లిపోయింది. పోనీ.. చిరు సోలో హీరోగా త్రివిక్ర‌మ్ సినిమా తీస్తాడ‌నుకుంటే.. దాన్నీ కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం చేసేశాడు చిరు. మ‌రి ఈ కాంబో.. ఇక క‌లేనా??


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS