టాలీవుడ్ ని కరోనా.. రౌండప్ చేస్తోంది. ఎన్టీఆర్ సైతం కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దాంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. ఎన్టీఆర్ క్షేమంగా తిరిగి రావాలంటూ.. ప్రార్థనలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సమాచారం తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించారు. ఆయన కొద్ది సేపటి క్రితం ఎన్టీఆర్ ఆరోగ్యంపై అప్ డేట్ ఇస్తూ... ఓ ట్వీట్ చేశారు.
``కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.అతను, వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు .తను చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉన్నారని తెలుసుకుని నేను చాలా సంతోషించాను .త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ తారక్`` అంటూ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్ ఎన్టీఆర్ అభిమానుల హృదయాల్ని గెలుచుకుంటోంది. `అందుకే నువ్వు బాస్ అయ్యావు` అంటూ తారక్ ఫ్యాన్స్ చిరుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.