తెలుగులో అయినా, హిందీలో అయినా, తమిళంలో అయినా ఎక్కడ ఏ భాషలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కినా దాన్ని 'బాహుబలి'తో పోల్చి చూడటం జరుగుతోంది. 'బాహుబలి' సాధించిన విజయం అంత గొప్పది. సల్మాన్‌ఖాన్ నటించిన 'ట్యూబ్‌లైట్'ని కూడా 'బాహుబలి'తో పోల్చారు. కానీ 'ట్యూబ్‌లైట్' ఫెయిలయ్యింది. ఆ సినిమా నేపథ్యం వేరు, 'బాహుబలి' గ్రాండియర్ లుక్ వేరు. 'బాహుబలి'తో ఈ మధ్యకాలంలో పోటీ పడదగ్గ అవకాశం ఏ సినిమాకన్నా ఉంటే అది 'రోబో 2.0' మాత్రమే కావొచ్చు. 2018 జనవరిలో ఈ సినిమా రూపొందనుంది. రజనీకాంత్ స్టార్‌డమ్, శంకర్ మేకింగ్ ఇవన్నీ 'రోబో 2.0'ని టాప్ లెవల్‌లో నిలబెట్టే అవకాశం ఉంది. ఇంకో వైపున తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందనున్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' గురించి కూడా ప్రీ ప్రొడక్షన్‌లోనే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. వంద కోట్లు, 150 కోట్లు బడ్జెట్ అనేది ఇక్కడ పెద్ద విషయం కాదని, తెలుగు సినిమా ఖ్యాతి ఇంకోసారి విశ్వవ్యాపితం చేసేలా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని తెరకెక్కించబోతున్నారని తెలియవస్తోంది. లుక్ దగ్గర్నుంచి, మేకింగ్ వరకు అన్ని విషయాల్లోనూ చిరంజీవి ఖచ్చితమైన అవగాహనతో ఉన్నారు. చిరంజీవి తనయుడు రామ్‌రణ్ ఈ సినిమాని నిర్మంచబోతుండడంతో బడ్జెట్ సమస్యలు లేవు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం అంటే గ్రాండియర్ లుక్‌కి లోటు ఉండదు. కాబట్టి 'ఉయ్యాలవాడ' రేంజ్ 'బాహుబలి'లా ఉండాలని, అంతకు మించి ఉండాలని కోరుకోవడం అత్యాశ కాబోదు.