'ఖైదీ నెంబర్ 150' అనే ఓ సాధారణ కమర్షియల్ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి చేరడం వెనుక ఖచ్చితమైన 'మార్కెట్' వ్యూహం ఉంది. అదే వ్యూహంతో చిరంజీవి కొత్త చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. సినిమా నిర్మాణానికి ముందే ఈ వ్యూహాల్ని ఖరారు చేసి, దానికి తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించనున్నారు. ఆగస్ట్‌లో సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది అని రామ్ చరణ్ తెలిపారు. ఆగష్టులో చిరంజీవి పుట్టినరోజు రోజునే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు కానుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ 'ఉయ్యాలవాడ' చిత్రాన్ని రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారమ్. 'బాహుబలి' ఇచ్చిన ఉత్సాహంతో 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' చిత్రాన్ని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయనున్నారు. చిరంజీవికి జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు తెలిసిందే. 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఓవర్సీస్‌లో సాధించిన వసూళ్లు మైండ్ బ్లోయింగ్. అలాంటిది దేశభక్తి ఉప్పొంగే చిత్రం కాబట్టి రీచ్ ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం చిరంజీవి తన గెటప్ మార్చుకుంటున్నారు. గుబురుగా గెడ్డం పెంచి కనిపిస్తున్నారు.