టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల కోలాహలం జోరుగా సాగుతోంది. రెండు రోజుల వ్యవధిలో డజను సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్సయిపోయాయి. ఆ టైమ్ కి వస్తాయో, రావో తెలీదు గానీ, ఇప్పటికైతే.. బెర్తులు ఖాయం చేసేసుకుంటున్నారంతా. ఫిబ్రవరి తొలి వారం నుంచి... దసరా వరకూ జాతరే జాతర. అయితే.. మేలో స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. వెంకటేష్ `నారప్ప` మే 14న వస్తోంది. మే 23న.. ఆచార్య విడుదలకు సిద్ధమైంది. రెండు సినిమాలకు మధ్య వారమే తేడా.
`నారప్ప`తో పోలిస్తే... `ఆచార్య`కు క్రేజ్ ఎక్కువన్నది వాస్తవం. నారప్ప విడుదలై... మంచి టాక్ తెచ్చుకున్నా.. రెండో వారంలోనే `ఆచార్య` వచ్చేస్తాడు. అప్పటికి సగానికి పైగా థియేటర్లు కోల్పోవాల్సివుంటుంది. అయితే... `నారప్ప` బలం.. ఇది... సురేష్ ప్రొడక్షన్స్ సినిమా కావడం. సురేష్ వాళ్ల చేతిలో చాలా థియేటర్లున్నాయి. అవన్నీ `నారప్ప`కే ఉండిపోతాయి. `ఆచార్య`కి తగినన్ని థియేటర్లు దొరక్కపోవొచ్చు. మొత్తానికి చిరు సినిమా ఎఫెక్ట్ వెంకీపై, వెంకీ సినిమా ఎఫెక్ట్ చిరుపై పడే అవకాశాలు మొండిగా ఉన్నాయి.