చిరు ట్వీట్ వేశాడోచ్‌.. మ‌రి బాల‌య్య ఏమంటాడో?

మరిన్ని వార్తలు

ట్విట్ఱ‌ర్ లో చిరంజీవి య‌మ యాక్టీవ్‌గా ఉంటున్నాడు. రోజూ.. ఏదో ఓ ట్వీట్‌. సెల‌బ్రెటీల పుట్టిన రోజు వ‌స్తే... చిరు ట్వీట్ త‌ప్ప‌కుండా ఉంటుంది. అంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ.. స‌ద‌రు హీరో ఫ్యాన్స్‌ని సైతం అల‌రిస్తున్నాడు. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిరు ట్వీట్ చేస్తాడా? లేదా? అని ఆస‌క్తిగా ఎదురు చూశారు జ‌నాలు. ఎందుకంటే ఈమ‌ధ్య చిరు - బాల‌య్య మ‌ధ్య అనుకోని గ్యాప్ వ‌చ్చింది. దానికి కార‌ణం.. చిత్ర‌సీమ‌లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాలే. లాక్‌డౌన్ త‌ర‌వాత‌.. షూటింగులు ఆగిపోయాయి.

 

చిత్ర‌సీమ‌లో స‌మ‌స్య‌లు పెరిగిపోయాయి. వాటిని ప‌రిష్కరించ‌మ‌ని కోరుతూ.. టాలీవుడ్ ప్ర‌ముఖులు కేసీఆర్‌ని క‌లిశారు. ఈ మీటింగుల‌కు బాల‌య్య‌ని పిల‌వ‌లేదు. దాంతో ఆయ‌న అల‌గ‌డం, కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌రిశ్ర‌మ‌కు షాక్ ఇచ్చాయి. బాల‌య్య వ్యాఖ్యలు ప‌రోక్షంగా చిరుని తాకాయి. దాంతో చిరు - బాల‌య్య మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. అందుకే బాల‌య్య పుట్టిన రోజున చిరు ట్వీట్ చేస్తాడో, లేదో అనుకున్నారంతా. కానీ అంద‌రి అంచ‌నాలూ ప‌టాపంచ‌లు చేస్తూ.. చిరు ట్వీట్ చేశాడు. ''అర‌వైలో అడుగు పెడుతున్న మా బాల‌కృష్ణ‌కు ష‌ష్టిపూర్తి శుభాకాంక్ష‌లు.

 

ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఆయురారోగ్యాల‌తో నిండు నూరేళ్ల సంబరం కూడా జ‌రుపుకోవాల‌ని. అంద‌రి అభిమానం ఇలానే పొందాల‌ని కోరుకుంటున్నా'' అంటూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశాడు. ఈ వివాద‌న్ని చిరు త‌నదైన స్టైల్‌లో ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడ‌నే చెప్పాలి. మ‌రి ఈ ట్వీట్ పై బాల‌య్య ఎలా స్పందిస్తాడో చూడాలి. చిరుకి థ్యాంక్స్ చెబుతూ బాల‌య్య రీ ట్వీట్ చేస్తే.. ఇక ఈ వివాదం స‌ర్దుమ‌ణిగిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS