ఈరోజు రాత్రి నుంచే చిరు సంద‌డి

By Gowthami - January 02, 2020 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

సైరా త‌ర‌వాత మ‌రోసారి చిరంజీవి కెమెరా ముందుకు వ‌స్తున్నాడు. త‌న 152వ సినిమా కోసం. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. రామ్ చ‌ర‌ణ్‌తో కలిసి మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ రోజు నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. నైట్ ఎఫెక్ట్‌లో కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని స‌మాచారం. చిరు - త్రిష‌ల‌పై ఓ పాట‌ని తెర‌కెక్కిస్తార‌ని చెప్పుకుంటున్నారు.

ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే చిత్ర‌బృందం రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌లేదు. రిలీజ్ డేట్ విష‌యంలో అప్పుడే తొంద‌ర‌ప‌డి ఓ ప్ర‌క‌ట‌న చేయ‌డం కెరెక్ట్ కాద‌ని, దాని కోసం కొంత స‌మ‌యం తీసుకుందామ‌ని చూస్తున్నారు. ఏదైనా స‌రే ఈ యేడాదే చిరు 152వ సినిమా విడుద‌ల కానుంది. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS