చిరంజీవి నుంచి వస్తున్న మరో రీమేక్ `లూసీఫర్`. మోహన్ రాజా దీనికి దర్శకుడు. స్క్రిప్టు మొత్తం పూర్తయ్యింది. త్వరలోనే ఈసినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం `కింగ్ మేకర్`, `గాడ్ ఫాదర్` అనే రెండు పేర్లు పరిశీలనలోఉన్నాయి. `గాడ్ ఫాదర్` దాదాపు ఓకే అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో మరో కథానాయకుడూ కనిపించబోతున్నాడు,.
`లూసీఫర్` క్లైమాక్స్ లో పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. కథలో అది షాకింగ్ ఎలిమెంట్. రీమేక్ లో ఆ పాత్ర లేకుండా చేశారని వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేం జరగడం లేదు. పృథ్వీరాజ్ పాత్ర అలానే ఉంది. ఆ పాత్రలో ఓ హీరో కనిపించాలి. ముందు ఈ పాత్ర లో చరణ్ కనిపిస్తే బాగుంటుందనుకున్నారు. కానీ.. `ఆచార్య`లో చరణ్ ఉన్నాడు. వెంట వెంటనే చిరు - చరణ్‌లు కనిపిస్తే బాగోదని చిరు భయపడుతున్నారు. ఈ పాత్ర కోసం ఓ సందర్భంలో బన్నీని కూడా అనుకున్నారు. కానీ లెంగ్త్ చాలాతక్కువ. అందుకోసం బన్నీని దించడం సబబు కాదని ఊరుకున్నారు. కచ్చితంగా ఈ క్యారెక్టర్ మెగా హీరోనే చేయాలి అనుకుంటే... సాయిధరమ్ తేజ్ ని తీసుకొస్తారు. లేదంటే.. అతిథి పాత్ర కోసం మరో యువ హీరోని సంప్రదించే అవకాశాలున్నాయి. మొత్తానికి ఇందులో మరో హీరో ఎంట్రీ ఖాయం. బాబి దర్శకత్వం వహించే సినిమాలోనూ మరో కథానాయకుడు కనిపిస్తాడు. మొత్తానికి.. చిరు కి కూడా మల్టీస్టారర్‌పై మోజు పెరిగిపోయింది.