`అయ్యప్పయుమ్ కోషియమ్` సినిమా రీమేక్ పై ఓ స్పష్టత వచ్చేసింది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు. తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి కూడా ఆసక్తి కరమైనచర్చ జరుగుతోంది.
ఈ సినిమాకి `బిల్లా రంగా` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. చిరంజీవి - మోహన్ బాబు కాంబినేషన్‌లో ఇది వరకు `బిల్లా - రంగా` అనే సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ టైటిల్ పవన్ సినిమాకి పెట్టబోతున్నారన్నమాట. బీజూ మీనన్ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఫృథ్వీ రాజ్ పాత్రలో రానా నటించే అవకాశాలున్నట్టు టాక్. మరి ఇందులో బిల్లా ఎవరో, రంగా ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. పవన్ చేతిలో ప్రస్తుతం `వకీల్ సాబ్` ఉంది. అది పూర్తయిన వెంటనే ఈ రీమేక్ ని మొదలెట్టే అవకాశాలున్నాయి.