ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో సమంత స్పెషల్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. `వైల్డ్ డాగ్` షూటింగ్ కోసం నాగార్జున కులూమనాలీ వెళ్లడంతో ఆ స్థానంలో సమంత రావాల్సివచ్చింది. కానీ తన మాట తీరుతో, నవ్వులతో, పంచ్‌లతో.. కార్యక్రమాన్ని రక్తి కట్టించింది. సమంతకు తోడుగా ఈ వారం చాలామంది సెలబ్రెటీలు వచ్చారు. కార్తికేయ, అఖిల్, హైపర్ ఆది, పాయల్ రాజ్ పుత్ వీళ్లంతా.. సమంతతో పాటు సందడి చేశారు.
అయితే కార్తికేయ - సమంత మధ్య ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. ఈ వారం ఎలిమినేట్ అయిపోయిన దివిని సాగనంపుతూ... దివికి నీ సినిమాలో ఓ ఛాన్స్ ఇవ్వు` అని కార్తికేయని కోరింది సమంత. దానికి కార్తికేయ ఓకే అన్నాడు. వెంటనే `మరి మీరు నా సినిమాలో నటిస్తారా` అంటూ.. సమంతని అడిగేశాడు. సమంత కూడా ఓకే అంది. `అయితే మనం ముగ్గురం కలిసి నటిద్దాం` అని మాట ఇచ్చేసింది. సో... సమంతతో కార్తికేయని ఓ సినిమాలో చూసే ఛాన్స్ వుందన్నమాట. ఇది కేవలం `బిగ్ బాస్` షో కోసమే చెప్పారా? లేదంటే నిజంగా అలాంటి ప్రతిపాదన ఉందా? అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోందిప్పుడు. చూద్దాం... ఏమవుతుందో?