అల్లు అరవింద్ - చిరంజీవిల మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైనది. చిరు ఎదుగుదలలో అల్లు పాత్ర చాలా కీలకం. అయితే.. తన ఇంట్లోంచే ఓ హీరో అల్లు అర్జున్ రూపంలో పుట్టుకు రావడంతో.. బన్నీపై ఫోకస్ చేసి, చిరుకి మెల్లమెల్లగా దూరమవుతూ వచ్చాడు అల్లు అరవింద్. ఈ విషయం మెగా ఫ్యాన్స్ సైతం ఒప్పుకుంటారు. తన కెరీర్‌లో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సాయపడ్డ చిరంజీవిని, చిరుతో పాటు వచ్చిన ఫ్యాన్ బేస్‌ని బన్నీ పక్కన పెట్టి... తనకంటూ ఓ ఫాలోయింగ్ కూడా సృష్టించుకొన్నాడు. దాంతో.. అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. వీలైనప్పుడల్లా... ఆ గ్యాప్ పెంచుకుంటూ పోతున్నారు తప్ప.. పూడ్చడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు.
తాజాగా చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు హైటెక్స్ లో ఘనంగా జరిగాయి. `మెగా కార్నివాల్` పేరుతో... నాగబాబు ఓ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెగా హీరోలంతా వస్తారని నాగబాబు చెప్పాడు. ఈ వేడుకకు పవన్ కల్యాణ్ రాలేదు. దానిని ఎవరూ తప్పుబట్టరు. ఎందుకంటే పొలిటికల్ గా పవన్ చాలా బిజీ. ఆయన ఎప్పుడూ అన్నయ్య పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదు. అయితే ఈ ఫంక్షన్‌లో బన్నీ కూడా కనిపించలేదు. సరిగ్గా ఫంక్షన్ ఉందగా.. ఆయన ఫారెన్ చెక్కేశాడు. కనీసం ఓ వీడియో బైట్ కూడా విడుదల చేయలేదు. దాంతో చిరు ఫ్యాన్స్ హర్టయిపోయారు. బన్నీని తీవ్రంగా తప్పుబడుతున్నారు. బన్నీ ఈ ఫంక్షన్ కి వస్తే బాగుండేదని, చిరుకి విషెష్ చెబితే గౌరవంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బన్నీ.. చిరు అండదండలతోనే ఎదిగాడని, ఆ విషయం మర్చిపోతున్నాడని చిరు ఫ్యాన్స్ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. దీనిపై బన్నీ ఎలా స్పందిస్తాడో చూడాలి.