తమన్ ఇప్పుడు నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ తన తఢాకా చూపిస్తున్నాడు. స్టార్ హీరో సినిమాకి మ్యూజిక్ అనగానే ఇప్పుడు అందరికీ తమనే గుర్తొస్తున్నాడు. పాటలతోనే కాదు, ఆర్.ఆర్‌తోనూ సినిమాల్ని నిలబెట్టేస్తున్నాడు తమన్. తమన్ దగ్గరున్న మరో మంచి క్వాలిటీ సమయానికి పాటలు రెడీ చేసి పెట్టడం. తక్కువ సమయంలో క్వాలిటీ మ్యూజిక్ అందివ్వడం. అయితేఈమధ్య తమన్ టైమ్ తప్పుతున్నాడన్నది టాలీవుడ్ టాక్.
చేతినిండా సినిమాలు ఉండడంతో ఏ సినిమాకీ తమన్ న్యాయం చేయలేకపోతున్నాడని, తమన్ వల్ల ఇప్పుడు కొన్ని సినిమాలు ఆలస్యమవతున్నాయని, ఏదో ఓ పాట ఇచ్చేసి, `మమ` అనిపించేసుకుంటున్నాడని, అందుకే క్వాలిటీ తగ్గిపోతుందని తమన్‌పై కొత్తగా విమర్శలు వినవస్తున్నాయి. తమన్ విషయంలో చిరంజీవి కూడా సీరియస్‌గానే ఉన్నారని టాక్. `గాడ్ ఫాదర్` చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. చిరు సినిమాకి పనిచేయడం తమన్ కి ఇదే తొలిసారి. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిపోగా. చిరుతో చివాట్లు తింటున్నాడట.
ఇటీవల గాడ్ ఫాదర్ టీజర్ బయటకు వచ్చింది. అందులో గని ట్రాక్ ని యధావిధిగా దింపేశాడు తమన్. దాంతో ట్రోలింగ్ కి గురి కావాల్సివచ్చింది. అంతేకాదు.. పాటల విషయంలోనూ తమన్ అశ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోందట. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ - చిరంజీవిలపై ఓ పాట ఉంది. ఆట్యూన్ తో చిరు అస్సలు సంతృఫ్తిగా లేడట. చాలాసార్లు మార్చి, మార్చి.. చివరికి ఓ ట్యూన్ ఓకే చేశాక, పాటని రికార్డ్ చేసి ఇవ్వడంలో లేట్ చేసేశాడట. తమన్ పాట రాకపోవడంతో ఆ పాటని తెరకెక్కించడంలో చాలా జాప్యం జరిగిందని చివరికి ఏదోలా ఆ పాటని పూర్తి చేశారని టాక్. తమన్ ఇలా ఆలస్యంగా ట్యూన్లు ఇవ్వడం, గని ట్రాక్ ని ఎత్తేయడం చిరుకి అసంతృప్తి కలిగించాయని, మరోసారి తమన్ కి అవకాశం ఇవ్వకూడదని చిరు గట్టిగా డిసైడ్ అయ్యాడని ఇన్ సైడ్ వర్గాల టాక్.