మలయాళ సూపర్ హిట్ సినిమా `లూసీఫర్`ని చిరంజీవి తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. స్క్రిప్టు పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయి. `ఆచార్య` తరవాత... ఈ సినిమానే సెట్స్‌పైకి వెళ్లాలి. అయితే అనూహ్యంగా ఈ సినిమాపై గాసిప్పులు మొదలయ్యాయి. `లూసీఫర్` స్క్రిప్టు విషయంలో చిరు సంతృప్తిగా లేడని, ఈ సినిమా రీమేక్ ని దాదాపు ఆయన పక్కన పెట్టేశాడన్న వార్తలు గుప్పుమన్నాయి. అంతే కాదు.. ఆచార్య తరవాత చిరంజీవి కాస్త బ్రేక్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.
అయితే `లూసీఫర్` రీమేక్ ఆగిపోవడం అవాస్తవం అని చిరు కాంపౌడ్ వర్గాలు గట్టిగా క్లారిటీ ఇస్తున్నాయి. ఆచార్య తరవాత.. లూసీఫర్ రీమేక్ పట్టాలెక్కడం ఖాయమని, లూసీఫర్ స్క్రిప్టు పనులు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే... కథానాయిక, ఇతర వివరాలతో ఓ అప్ డేట్ రానుందని తెలుస్తోంది. సో.. చిరు రీమేక్ ఆగిపోయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నమాట.