బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఈమధ్య హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అటు బుల్లి తెరపై, ఇటు వెండి తెరపై మాచిరాజు బిజీ. అయితే... మాచి రాజు ఇంట్లో ఇటీవల ఓ పెను విషాదం చోటు చేసుకుంది. మాచి రాజు తండ్రి పాండు రంగ కరోనా తో మృతి చెందారు. అప్పటి నుంచీ సోషల్ మీడియాకు మాచిరాజు దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు తండ్రిని గుర్తుచేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టాడు.
``నేనీరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నువ్వే. జీవితంలో నువ్వు నేర్పిన పాఠాలకు, నా జీవితాన్ని మలిచిన తీరుకీ కృతజ్ఞతలు..`` అంటూ భావోద్వేగభరితంగా పోస్టు మొదలెట్టాడు. ``నా రెక్కలతో నేను ఎదిగే ధైర్యాన్ని ఇచ్చావు. నా తప్పుల్ని సరిదిద్ది ముందుండి నడిపించావు.. నాజీవితంలో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. ఈ జీవితం నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా.. నిన్నుమాత్రం మర్చిపోను. మళ్లీ మనం కలుసుకునేంత వరకూ... నిన్ను చాలా మిస్ అవుతా..`` అంటూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ప్రదీప్.
My SuperHero 🌟 pic.twitter.com/kEylcJvrFv
— Pradeep Machiraju (@impradeepmachi) May 23, 2021