రెండు రోజుల నుండి అన్ని ప్రసార మాధ్యమాలలో మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంలో నయనతార నటించడం లేదు అన్న వార్త తెగ చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అన్న అంశం పైన క్లారిటీ వచ్చింది.
వివరాల్లోకి వెళితే, నయనతార ఈ చిత్రం నుండి వెళ్ళిపోలేదు అని త్వరలోనే షూటింగ్ కి హజరు అవుతుంది అని తెలిసింది. ఇక ఆమె ఈ చిత్రం వదిలేసింది అని వస్తున్న వార్తల పైన క్లారిటీ వచ్చేసింది అలాగే ఈ చిత్రంలో ఆమె పాత్ర కీలకం అవ్వడంతో దర్శకుడు ఆమె పాత్ర పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తున్నది.
ఇక నయన్ ఇప్పుడు తమిళంలో చాలా బిజీగా ఉంది, ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు చిత్రాలు ఉండటం వల్ల కూడా ఆమె సైరా నరసింహా రెడ్డి చిత్రం షూటింగ్ లో త్వరగా పాల్గొనకపోవడానికి కూడా ఒక ప్రధాన కారణం అని తెలుస్తున్నది.
మొత్తానికి నయనతార ఈ చిత్రంలో చిరు సరసన సందడి చేయనుంది అన్న విషయం మాత్రం పక్కా.