చిత్ర పరిశ్రమకు కండీషన్లు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

మరిన్ని వార్తలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు తాజాగా కండీషన్లు పెట్టారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలన్న ఆయన వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై సినిమాకు ముందు డిస్ క్లెయిమర్స్ ప్రదర్శించాలని చెప్పారు. సినిమా టికెట్  రేట్లు  పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటి పై అవగాహన కల్పించడం లేదని పేర్కొన్నారు.  


డ్రగ్స్, సైబర్ నేరాల పై సినిమా కు ముందు కానీ సినిమా తరువాత అయిన 3 నిమిషాలు వీడియో తో అవగానే కల్పించాలని, అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదని, అలాంటి నిర్మాతలకు, డైరెక్టర్ లకు, నటీనటులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని తేల్చి చెప్పారు. దీనికి సినిమా థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలని, డ్రగ్స్, సైబర్ నేరాలు పై థియేటర్లు లో ప్రసారం చేయక పోతే మీ థియేటర్లు కు అనుమతి లేదని తేల్చి చెప్పారు. మరి సిఎం రేవంత్ షరతుల పై చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS