నటీనటులు: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు
దర్శకత్వం : ఆర్ అజయ్ జ్ఞానముత్తు
నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్
సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: హరీష్ కన్నన్
ఎడిటర్: భువన్ శ్రీనివాసన్
రేటింగ్: 2.5/5
విక్రమ్ అంటేనే వైవిధ్యం. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలని తప్పించే నటుల్లో విక్రమ్ ముందు వరుసలో వుంటారు. ఇక ఆయన డిఫరెంట్ గెటప్స్ లో వచ్చిన చిత్రాలకు మంచి ట్రాక్ రికార్డ్ వుంది. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ .. ఇవన్నీ అద్భుతాలే. ఇప్పుడు ఆయన నుండి కోబ్రా వచ్చింది. ట్రైలర్ లో దాదాపు పది గెటప్స్ కనిపించి ఆసక్తిని పెంచాయి. చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుది కూడా మంచి ట్రాక్ వుంది. ఈ సినిమా గ్రాండ్ గా తీశారని ట్రైలర్ చూస్తే అర్ధమైయింది. లెక్కలని ఉపయోగించి నేరాలకు పాల్పడే ఒక వ్యక్తి కథని ట్రైలర్ లో చూపించడం ఈ సినిమా కథపై కూడా ఆసక్తిని పెంచింది. టీమ్ ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాతో నటుడిగా పరిచయం కావడం మరో విశేషం. ఇన్ని విశేషాలు వున్న కోబ్రా కథలోకి వెళితే..
కథ :
మది (విక్రమ్) గణిత మేధావి. చిన్నప్పటి నుండి లెక్కలతో మ్యాజిక్ చేస్తుంటాడు. ఐదో క్లాస్ లోనే పిజీ లెక్కలు సునాయాసంగా చేసేస్తుంటాడు. మది ఓ అనాధ ఆశ్రమంలో పెరిగి పెద్దవాడవుతాడు. ఆశ్రమంలోని పిల్లలకు లెక్కల పాఠాలు నేర్పుతుంటాడు. మరోవైపు కోబ్రా వరుస హత్యలు చేస్తూ.. పోలీసులకు సవాలు విసురుతుంటాడు మాథ్స్ ని ఉపయోగించి, ఆ సూత్రాలతో తెలివిగా ఎవరికీ దొరక్కుండా హత్యలు చేస్తుంటాడు. కోబ్రాని పట్టుకోవడం కోసం ఇంటర్ పోల్ ఆఫీసర్ ఇస్లాం (ఇర్ఫాన్ పఠాన్ ) రంగంలో దిగుతాడు. అసలు ఈ కోబ్రా ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? చివరికి పోలీసులకు చిక్కాడా ? అసలు ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చుశాయనేది మిగతా కథ.
విశ్లేషణ :
కథని చాలా ఆసక్తికరంగా మొదలెట్టాడు దర్శకుడు. వరుసగా రెండు హత్యలు జరుగుతాయి. లెక్కలు వుపయోగించి ఈ హత్యలు చేయడం ఇందులో యునిక్ పాయింట్. ఈ కేసుని విచారిస్తున్న పోలీసులు ఓ అపరిచితుడు క్లూస్ ఇవ్వడం, దాని వెనుక కొంత సుస్పెన్స్ ని చక్కగాననే రాబట్టుకున్నాడు దర్శకుడు. అసలు ఈ కోబ్రా ఎవరు అనే ఎక్సయిట్ మెంట్ ప్రేక్షకుల్లోకి కలిగేలా చేశాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్టు కూడా సెకండ్ హాఫ్ పై అంచనాలని పెంచుతుంది. అయితే చాలా ఎక్సయిట్ మెంట్ తో సెకండ్ హాఫ్ చూడ్డానికి కూర్చున్న ప్రేక్షకుడిని ఫ్యామిలీ డ్రామాతో విసిగించాడు దర్శకుడు.
ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి బావున్నా దాన్ని మరీ సాగదీసినట్లుగా వుంటుంది. విక్రమ్ గెటప్స్ అన్నీ ఫస్ట్ హాఫ్ లోనే అయిపోయాయి. ఇక థ్రిల్లింగ్ అంశాలు సెకండ్ హాఫ్ క ఏమీ మిగల్లేదు. దీంతో ఈ కథ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి నీరసించిపోతుంది. ఇక గణితం ఆధారంగా చేసుకొని ప్లాన్ చేసిన హత్యలు వెనుక లాజిక్కులు ఇచ్చే క్రమంలో ప్రేక్షకుడికి ఒక లెక్కల పాఠం వింటున్నట్టుగా వుంటుంది. కోబ్రాలో ఇది ఒక ప్రధాన సమస్య. కథ ఎంత క్లిష్టంగా వున్న ప్రేక్షకుడికి విడమరిచి చెప్పడం ఒక గొప్ప కథకుడి లక్షణం.
సినిమా అనే ప్రోడక్ట్ కి ఎండ్ యూజర్ ప్రేక్షకుడు. మనం ఒక యాప్ ని వాడుతున్నపుడు అది ఎంత సులువుగా ఆపరేట్ చేస్తున్నామనదే ముఖ్యం. అంతేగానీ దాని కోడింగ్ తో యూజర్ కి పని లేదు. కానీ కోబ్రా సినిమా అలా కాదు.. అర్ధం కాని లెక్కల పాఠంలా ఏవో మాటలు, ఏవో లెక్కలు చూపించుకుంటూ వెళ్ళాడు. అన్సర్ తెలిసిన లెక్కలా ప్రేక్షకుడు తలాడించడం తప్పితే ఆ స్టెప్స్ ని ఫాలో అవ్వడం సహనానికి పరీక్షపెట్టడమే. నిజానికి కోబ్రా విలక్షణమైన కథే. దాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులని కనెక్ట్ చేసే విధంగా ప్రయత్నించి వుంటే సినిమా మరో స్థాయిలో వుండేది.
నటీనటులు :
విక్రమ్ వన్ మ్యాన్ షో కోబ్రా. విక్రమ్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంటుంది. చాలా ఇంటెన్స్ గా చేశాడు. కొన్ని గెటప్స్ చక్కగా కుదిరాయి, మరికొన్ని గెటప్స్ పై సాంకేతికంగా మరింత వర్క్ చేయాల్సింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, మృణాలిని రవి, మీనాక్షి ఫీమేల్ లీడ్.
ఇందులో శ్రీనిధి పాత్ర ఆకట్టుకుటుంది. మృణాళిని , మీనాక్షి పాత్రలు ఓకే అనిపిస్తాయి. రోషన్ మంచి విలనిజం పంచాడు. ఇర్ఫాన్ కు ఇదితొలి చిత్రమే అయినా చాలా ఈజ్ తో చేశాడు. మిగతా పాత్రలు పరిధి మేర వున్నాయి,
టెక్నికల్:
సాంకేతికంగా సినిమా వున్నంతంగా వుంది. ఖర్చు తెరపై కనిపిస్తుంది. రెహ్మాన్ నేపధ్యం సంగీతం బావుంది కానీ పాటలు మాత్రం కథకి నప్పలేదు. కెమెరా పనితనం డీసెంట్ గా వుంది. ఎడిటింగ్ ఇంకా షార్ఫ్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథా నేపధ్యం
'నిర్మాణ విలువలు
ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్
కథనంలో సంక్లిష్టత
లాజిక్ లేని సన్నివేశాలు
డ్రామా లాగ్ అవ్వడం
ఫైనల్ వర్డిక్ట్: పాస్ మార్కుల దగ్గర ఆగిపోయిన లెక్కల మాస్టర్