షాకింగ్‌: సో హాట్‌ 'కలర్‌' ఫుల్‌ స్వాతి.!

By iQlikMovies - January 03, 2019 - 10:15 AM IST

మరిన్ని వార్తలు

పదహారణాల తెలుగమ్మాయ్‌ 'కలర్స్‌' స్వాతి తెలుగులో పలు సినిమాలతో అలరించింది. అయితే ఎప్పుడూ ఆమె హద్దులు దాటి ఎక్స్‌పోజింగ్‌ చేసిన దాఖలాల్లేవు. బుల్లితెరపై వ్యాఖ్యాతగా కెరీర్‌ ప్రారంభించి, ఓ దశలో ఓ మోస్తరు హీరోయిన్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న 'కలర్స్‌' స్వాతి, తమిళ సినిమాలతోనూ సత్తా చాటిన సంగతి తెల్సిందే.

 

క్యూట్‌గా కనిపించి, తన నటనతో ఆకట్టుకున్న కలర్స్‌ స్వాతి, సినిమాలకు దూరమయ్యాక అనూహ్యంగా హాట్‌ అప్పీల్‌తో కనిపించి అందరికీ షాకిచ్చింది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో కలర్స్‌ స్వాతి, స్విమ్‌ సూట్‌ ధరించి కన్పించింది. స్విమ్మింగ్‌ పూల్‌లో స్విమ్మింగ్‌ చేస్తూనే పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చింది. స్విమ్మింగ్‌ చేసేటప్పుడు స్విమ్‌ సూట్‌ ధరించక, చీర కట్టుకుంటామా? అని కూడా ప్రశ్నించిందామె.

 

సినిమా కెరీర్‌కి గుడ్‌ బై చెప్పేశాక, అదీ పెళ్ళయ్యాక కలర్స్‌ స్వాతి ఇంత హాట్‌గా కనిపించడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె డ్రస్సింగ్‌ ఆమె ఇష్టం అనుకోండి. అది వేరే సంగతి. అయినాగానీ, వెండితెరపై కన్పించని ఈ అందాల ప్రదర్శన బుల్లితెరపై.. అదీ ఓ ఇంటర్వ్యూ కోసం ఏంటి.? అన్నది ఆమెకే తెలియాలి. మళ్ళీ సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చి, హాట్‌ హాట్‌గా అందాల్ని ఆరబోసెయ్యాలన్న ఆలోచనతో కలర్స్‌ స్వాతి వుందా? ఏమో, వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS