ఈతరం కథానాయికలు రూటు మార్చారు. ఫేమ్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, జీవితంలో స్థిరపడిపోవాలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇది వరకు పెళ్లి విషయంలో ఆచి తూచి అడుగులేసే దక్షిణాది కథానాయికలు కూడా ఈ విషయంలో ఇప్పుడు జోరు పెంచారు. తాజాగా అమీజాక్సన్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. చాలాకాలం నుంచి జార్జ్ అనే అపర కుబేరుడితో ప్రేమలో ఉంది అమీ. ఇప్పుడు వాళ్లిద్దరూ నిశ్చితార్థపు ఉంగరాలు మార్చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఈ జంట జాంబియా వెళ్లింది. అక్కడే వీళ్ల నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని తెలుస్తోంది.
జార్జ్... ఓ మిలియనీర్. దేశ విదేశాల్లో అతనికి చాలా వ్యాపారాలున్నాయి. అతనికి సంబంధించిన ఓ ఈవెంట్లో పాల్గొన్న అమీ... జార్జ్‌ని తన ప్రేమలో పడేసింది. అప్పటి నుంచీ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. జార్జ్‌తో ఉన్న ఫొటోని అమీ తన ఇన్స్ట్రగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం.. ఈ జంట గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటీవల విడుదలైన '2.ఓ'లో కథానాయికగా నటించింది అమీ. జార్జ్‌తో పెళ్లయ్యాక.. అమీ పూర్తిగా సినిమాలకు దూరమయ్యే అవకాశం ఉంది.