కలర్స్ స్వాతికీ వేధింపులు తప్పలేదా.?

మరిన్ని వార్తలు

ఫేక్ ఐడీలతో కొన్ని అడ్డగోలు రాతలు రాస్తూ కొందరు ఆకతాయిలు సెలబ్రిటీలను అల్లరి పెడుతున్న సందర్భాలు అనేకం చూస్తూనే ఉన్నాం. ఆ లిస్టులోకి తాజాగా కలర్స్ స్వాతి కూడా చేరిపోయింది. తనపై ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారనీ స్వాతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిజానికి కలర్స్ స్వాతికి సొంతంగా ట్విట్టర్ ఖాతా కానీ, ఫేస్ బుక్ ఖాతా గానీ లేవట. కొందరు ఆకతాయిలు చేసిన నిర్వాకమే ఇదంతా.. అంటూ కలర్స్ స్వాతి చెబుతోంది. ఒకప్పుడు యాంకర్ గా బోలెడంత ఫాలోయింగ్ సంపాదించిన స్వాతి, ఆ ఫేమ్ తో హీరోయిన్ గానూ పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

 

తర్వాత పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేసింది. ఈ మధ్యనే కలర్స్ స్వాతి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో సూపర్ హిట్ మూవీ అయిన ‘కార్తికేయ’ సీక్వెల్ ‘కార్తికేయ 2’ తో స్వాతి తన సినీ కెరీర్ ని తిరిగి ప్రారంభించబోతోంది. మొన్నా మధ్య పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కి చందూ మొండేటి దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS