టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు వారబ్బాయ్.

By Inkmantra - May 06, 2020 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

‘హాయ్ టిక్ టాక్.. నేను వచ్చేశా. లెట్స్ హేవ్ ఫన్..’ అంటున్నాడు మన మంచు హీరో విష్ణు. కరోనా కారణంగా ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ అంతా సోషల్ మీడియాలోనే నిక్షిప్తమైపోయింది. అంటే, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వగైరా అన్న మాట. అందుకే మనల్ని ఎంటర్ టైన్ చేసే సెలబ్రిటీలు కూడా వీటి బాటలోనే నడుస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఆ బాటలో సక్సెస్ అవుతున్నారు. ఇక తాజాగా అదే బాటలో తానూ నడుస్తానంటున్నాడు మన మంచు హీరో. అవునండీ, మనోడు కూడా టిక్ టాక్ లోకి సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చేశాడన్న మాట. ఆ క్రమంలోనే తనదైన స్టైల్లో ఓ డిఫరెంట్ వీడియో సిద్దం చేసి వదిలాడు.

 

ఈ వీడియోలో చెప్పిన డైలాగే మనం స్టార్టింగ్ లో చెప్ఫుకున్న డైలాగ్ అన్న మాట. అయితే, ఈ వీడియోలో డైలాగ్ ఒక్కటే కానీ, ఎక్సప్రెషన్స్ మాత్రం చాలానే పండించాడు. ఎంతైనా విలక్షణ నటుడి తనయుడు కదా. ఏది ఏమైతేనేం, మనోడు మొత్తానికి ఓ టిక్ టాక్ ఖాతా తెరిచేశాడన్న మాటే. ఇక ఆ ఖాతాలో మంచు విష్ణు నుండి రాబోయే టిక్ టాక్ వీడియోలు ఎలాంటి ఫన్ జనరేట్ చేయబోతున్నాయో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇకపోతే మంచు విష్ణు ప్రస్తుతం ’మోసగాళ్ళు‘ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS