ప్రముఖ హాస్య నటుడు అలీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అలీ తల్లి .జైతున్బేబీ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయసు మీద పడడంతో ఆమె ఆరోగ్యం మరింత కృంగిపోయింది. నిజానికి అలీతోనే ఉండేవారామె. కానీ కొద్దిరోజుల క్రితం కూతురి దగ్గరకు వెళ్లారు. అలీ ప్రస్తుతం ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం రాంచీలో ఉన్నారు.
తల్లి మరణ వార్త తెలియగానే అక్కడి నుంచి బయల్దేరి హైదరాబాద్ వస్తున్నారు. జైతున్ అంత్యక్రియలు ఈరోజు మణికొండలో జరుగుతాయని తెలుస్తోంది. అమ్మతో అలీకి అనుబంధం చాలా ఎక్కువ. అమ్మ కోసం చాలాసార్లు హజ్ యాత్రకు వెళ్లొచ్చారు అలీ. ఆమె మరణం అలీకి, అలీ కుటుంబానికీ తీరని లోటే అని చెప్పాలి