ఇటీవల అలీ ట్వీట్లు టాలీవుడ్ లో బాగా హల్ చల్ చేశాయి. ముఖ్యంగా పవన్‌కి ఉద్దేశించి అలీపెట్టిన ట్వీట్లు .. అభిమానుల్లో వేడి పుట్టించాయి. పవన్‌ని పొగుడుతూ ట్వీట్ చేసినా, ఫ్యాన్స్ దాన్ని నెగిటీవ్ గా తీసుకున్నారు. అలీపై సెటైర్లు వేశారు.
కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే అలీకి ట్విట్టర్ ఎకౌంటే లేదట. తన పేరుతో ఎవరో ఫేక్ ఎకౌంట్ సృష్టించి ఇలా ట్వీట్లు చేశారన్న సంగతి అలీ గుర్తించారు. ఇప్పుడు ఈ విషయాన్ని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కొద్దిసేపటి క్రితం సైబర్ పోలీసులను ఆశ్రయించారు అలీ. తన పేరుతో ట్వీట్లు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ``నాకు ఇప్పటి వరకూ ట్విట్టర్ ఎకౌంట్ లేదు. నా పేరుతో ఎవరో ట్వీట్లు చేస్తున్నారు. అవి అభిమానులకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నాయి. నేను త్వరలో ట్విట్టర్లో చేరతా. ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్లు నేను చేసినవి కావు`` అని అలీ క్లారిటీ ఇచ్చారు.