హాస్య నటులు హీరోలుగా మారడం సహజమే. ఆ పోకడ ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా మరో హాస్యనటుడు హీరోగా మారుతున్నాడు. తనే... సత్య. `స్వామి రారా` నుంచి మొన్నటి `మత్తు వదలరా` వరకూ ఎన్నో చిత్రాల్లో వినోదాన్ని పంచాడు సత్య. ఇప్పుడు హీరో అయిపోతున్నాడని టాక్. సందీప్ కిషన్ నిర్మాతగా ఇటీవలే `వివాహ భోజనంబు` అనే సినిమా ప్రకటించారు. అందులో హీరో ఎవరో చెప్పలేదు.
`నాకు బాగా ఇష్టమైన నటుడ్ని హీరోగా పరిచయం చేస్తున్నా` అని హింట్ ఇచ్చాడు సందీప్ కిషన్. ఆ నటుడు.. సత్యనే అని తెలుస్తోంది. ఇదో వినోద భరితమైన చిత్రం. సత్య అయితే... ఆ క్యారెక్టర్‌కి బాగా సరిపోతాడని సందీప్ భావిస్తున్నాడు. సత్య కూడా ఓకే అనేశాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.