ప్రభాస్ నుంచి వరుసగా కొత్త సినిమాల వివరాలు వస్తున్నాయి. `ఆది పురుష్`తో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఖరారైపోయింది. మరోవైపు నాగ అశ్విన్ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలన్నీ పూర్తవ్వాలంటే మరో ఐదేళ్లయినా పడుతుంది. అందుకే.. ప్రభాస్ కోసం కథలు తయారు చేసుకున్న నవతరం దర్శకులు ఇప్పుడు నిరుత్సాహంలో పడిపోయారు.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ ఓ సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈమధ్య ఆ వార్త ఇంకా బలంగా చక్కర్లు కొట్టింది. ప్రభాస్ త్వరలోనే ప్రశాంత్ నీల్ తో జట్టు కడతాడని, ఈ సినిమా మొదలవ్వడం ఖాయమని.. చెప్పుకున్నారు. ఇదో రీమేక్ అని, కన్నడలో ప్రశాంత్ నీల్ తీసిన `ఉగ్రం`ని తెలుగులో రూపొందిస్తారని అన్నారు. అయితే.. `ఆది పురుష్` ఖరారవ్వడంతో... ప్రశాంత్ నీల్ సినిమా పక్కకు వెళ్లిపోయింది. ఈ ప్రాజెక్టుని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టే. ఎందుకంటే.. ఈ సినిమాలు పూర్తయ్యేసరికి సమీకరణాలు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. సో.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఫిక్సయిపోవడం బెటర్.