కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతున్నది.
ఆయన ఆత్మహత్యకి భార్య వేధింపులే కారణం అని అంటుండగా ఆమె మాత్రం విజయ్ కి వేరే స్త్రీలతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పడం అలాగే విజయ్ కి ఎయిడ్స్ కూడా ఉందని చెప్పడం అందరిని విస్మయానికి గురిచేసింది.
ఇక విజయ్ తన ఆత్మహత్యకి ముందు తీసుకున్న సేల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు విచారణ మొదలుపెట్టారు. భార్య పైన ఇంకొక ఇద్దరి పైన విజయ్ తండ్రి జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.
ఇవ్వన్ని పక్కకి పెడితే, నిన్న పోస్టుమార్టం అనంతరం విజయ్ మృతదేహాన్ని బంధువులు, స్నేహితుల సందర్శనార్ధం ఆయన ఇంటికి తరలించారు. ఈ క్రమంలోనే ఆయన భార్య, కూతురు ఆఖరిచూపుకి వస్తారు అని అందరు ఎదురు చూసారు.
అయితే వారిరువురు రాకపోవడంతో ఇక విజయ్ కుటుంబీకులే దహన కార్యక్రమాలు చేయడం జరిగింది. విజయ్ ని కడసారి చూసేందుకు ఆయన భార్య, కూతురు రాకపోవడం అందరికి ఆశ్చర్యానికి లోను చేసింది.