రామ్ చరణ్-ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గురించి బయటకి వస్తున్న విషయాలు ఈ ఇద్దరి హీరోల అభిమానులకి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పైన అంచానాలు పెంచేస్తున్నాయి.
బయటకి వస్తున్న తాజా సమాచారం ప్రకారం- ఈ చిత్ర షూటింగ్ మూడు షెడ్యూల్స్ లో చిత్రీకరించనున్నారట. ఒక షెడ్యూల్ లో రామ్ చరణ్ తో అయితే మరో షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో చేస్తారట. ఇక ఆఖరిగా ఇద్దరు కనిపించే సన్నివేశాలని ఆఖరి షెడ్యూల్ లో చిత్రీకరణ జరుపుతారట.
దీనితో ఈ హీరోల వేరే చిత్రాల షెడ్యూల్స్ కి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నదట. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అవ్వడం అందులోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది.
వీరి ప్లానింగ్ బట్టి ఈ చిత్రం 2019 దసరాకి వచ్చే అవకాశం ఉన్నట్టు ఫిలిం నగర్ వర్గాల టాక్.