భారీ అంచనాల మధ్య పుష్ప పార్ట్ 1 శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకి డివైట్ టాక్ రావడం చిత్రబృందాన్ని, బన్నీ అభిమానుల్నీ విస్మయంలో పడేసింది. మూడు గంటల పాటు సాగిన సినిమా ఇది. సీన్లు లెంగ్తీగా ఉండడం, క్యారెక్టర్లు ఎక్కువైపోవడం ప్రధాన సమస్యగా మారింది.
సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్, అజయ్ ఘోష్ ఇలా ప్రతీ ఒక్క పాత్రకూ ప్రత్యేకమైన గెటప్ సృష్టించాడు సుకుమార్. ఈ గెటప్పులు, ఆ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, ఆయా పాత్రల రేంజ్ ని పెంచుతాయని సుకుమార్ భావించాడు. అయితే ఆ గెటప్పులే మరీ ఓవర్ అయిపోయాయి. సునీల్ ని వెండి తెరపై అలా చూడలేకపోతున్నారు జనం. అనసూయ విగ్గు మరీ విచిత్రంగా ఉంది. అది పెట్టుడు విగ్ అనే సంగతి అర్థమైపోతోంది. రష్మికని కూడా చాలా డీ గ్లామర్ గా చూపించారు. రష్మికని అలా చూడడం కూడా ఇబ్బందిగా మారింది. మొత్తానికి సుకుమార్ గెటప్పుల మీద ఎక్కువ ఫోకస్ పెడితే.... ఆ గెటప్పులే కొంప ముంచినట్టు అనిపిస్తోంది. పార్ట్ 2 లో అయినా ఈ విషయంపై సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటాడేమో చూడాలి.