ఖుష్బూ అంటే కొన్నేళ్ల క్రితం తెలుగు తెరపై హాట్ అండ్ క్యూట్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ గుర్తుకొస్తుంది. 'స్టాలిన్' సినిమాలో చిరంజీవికి అక్కగా కనిపించినా, 'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్‌కళ్యాణ్‌కి పిన్నిగా కనిపించినా ఒకప్పటి ఖుష్బూకీ, ఇప్పటి ఖుష్యూకీ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో అదే ఛార్మ్ ఉంది. కేవలం సినీ నటి మాత్రమే కాదు, ఆమె కాంగ్రెస్ నేత కూడా. నిన్న మొన్నటిదాకా తమిళ రాజకీయాలలో యాక్టివ్ రోల్ పోషించిన ఖుష్బూ అనూహ్యంగా తెలంగాణా ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది.
మెరుపు వేగంతో తెలంగాణాలో పలు చోట్ల పర్యటించారామె. గ్లామర్ ఒక్కటే కాదు, ఒక్కొక్క పొలిటికల్ డైలాగ్ ఆమె నోటి నుండి వస్తోంటే, అంతా ఓ రకమైన ఆలోచనలో పడిపోయారు. ప్రతీ మాట స్పష్టంగా జనంలోకి వెళ్లింది. విజయశాంతి, నగ్మా కూడా ఎన్నికల ప్రచారంలో కనిపించినా కాంగ్రెస్‌కి విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ అయినా ఖుష్బూనే ఎక్కువ హైలైట్ అయ్యింది. చిన్నప్పటి నుండీ ఏ విషయం మీదైనా కుండ బద్దలు కొట్టేయడం తనకలవాటనీ, అదే బోల్డ్‌నెస్ ఇప్పటికీ కొనసాగిస్తున్నాననీ, ఖుష్బూ తెలుపుతోంది.
తమిళనాడులో అభిమానులు ఒకప్పుడు తనకోసం గుడి కడితే, భయమేసిందనీ, ఆ తర్వాత తన బాధ్యత పెరిగిందని తెలుసుకుని ప్రజా సేవ కోసం నడుం బిగించాననీ అంటోంది. ఓ వైపు సినిమాలు, ఇంకోవైపు రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఖుష్బూ బిజీ బిజీగా ఉంటోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖుష్బూ పొలిటికల్ యాక్టివిటీస్ చేపడుతుందట.