బిగ్‌ ట్విస్ట్‌: ఈ సారి బిగ్‌బాసే పుల్లలు పెట్టేశాడు!

By iQlikMovies - August 24, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

బిగ్‌ హౌస్‌లో ఆశక్తికరమైన అంశం చోటు చేసుకుంది. పునర్నవి, శ్రీముఖిని కన్‌ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌ కొన్ని వీడియోలు ప్లే చేశారు. ఆ వీడియోస్‌లో తమ గురించి మిగిలిన కంటెస్టెంట్లు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిసేలా చేశాడు. పునర్నవి విషయానికి వస్తే, రాహుల్‌, వితికా, వరుణ్‌.. ఈ ముగ్గురూ పునర్నవి అక్కడ లేని టైంలో ఆమె గురించి కొంచెం నెగిటివ్‌గా మాట్లాడుకుంటున్న వీడియో ప్లే చేశాడు.

 

దాంతో వితికను రాహుల్‌నీ, వరుణ్‌నీ పునర్నవి అపార్ధం చేసుకుంది. ఎవర్ని నమ్మాలో ఈ హౌస్‌లో అర్ధం కావడం లేదు.. అంటూ తనలో తానే బాధపడింది. ఆయా కంటెస్టెంట్స్‌పై కాసేపు అలక ప్రదర్శించింది కూడా. ఎందుకో తెలీదు, వితికపై ఇంతకు ముందే పునర్నవి కోపంగా ఉంది. ఆ కోపం ఇప్పుడు మరింత ఎక్కువైంది. రాహుల్‌ని ఎలాగో క్షమించింది కానీ, వితికపై తనకు చాలా కోపంగా ఉందని రాహుల్‌ వద్ద చెప్పుకొచ్చింది.

 

ఇక శ్రీముఖికి రాహుల్‌ వీడియో చూపించాడు. అసలే రాహుల్‌ని హేట్‌ చేస్తున్న శ్రీముఖి, ఇక ఈ వీడియో చూశాక, అతనిపై మరింత అసహ్యం పెంచుకుంది. ఇక ఎప్పటికీ రాహుల్‌ని క్షమించబోననీ, రాహుల్‌తో ఫ్రెండ్‌షిప్‌ని యాకెసెప్ట్‌ చేయబోననీ డిసైడ్‌ అయిపోయింది. ఇలా హౌస్‌లో బిగ్‌బాస్‌ ఇచ్చిన షాక్‌ హౌస్‌మేట్స్‌తో పాటు, వీక్షకుల్ని కూడా ఆశ్చర్యపరిచింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS