'బాహుబలి' సినిమా కోసం తన కెరీర్లో ఎక్కువ టైమ్‌ని కేటాయించాల్సి వచ్చింది ప్రబాస్‌కి. దాదాపు ఐదున్నరేళ్లు ఒకే సినిమాకి కమిట్ అయిపోయాడు ప్రబాస్. అయితే, ఈ టైంలో పది సినిమాలు చేసినా దక్కనంత గౌరవాన్ని, అభిమానాన్ని, ఇమేజ్‌ని దక్కించుకున్నాడు. దేశ వ్యాప్తంగా, ఆ మాటకొస్తే, ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి' ప్రబాస్‌ని గుర్తు పట్టేంత ఇమేజ్ దక్కించుకున్నాడు. అయితే, ఈ సినిమా కారణంగా స్వేఛ్చ కోల్పోయానంటున్నాడు డార్లింగ్.
'బాహుబలి' తెచ్చిన అపారమైన స్టార్డమ్తో తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలో తెలియని ఒకరకమైన ఒత్తిడికి లోనవుతున్నానన్నాడు. 'సాహో' తర్వాత పూర్తిగా మారిపోతాడట. భారీ బడ్జెట్ చిత్రాల జోలికి ఇకపై అస్సలు పోనంటున్నాడు డార్లింగ్. అంతేకాదు, ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేసి, ఫ్యాన్స్‌ని ఖుషీ చేయడమే పనిగా పెట్టుకుంటాడట. ప్రబాస్ కమిట్మెంట్ బాగానే ఉంది. కానీ, 'సాహో' రిజల్ట్ తర్వాత ప్రబాస్ మళ్లీ ఎలా మారిపోతాడో ఇప్పుడప్పుడే ఊహించలేం.
'సాహో' ప్రమోషన్స్‌లో భాగంగా, ఈ ఆశక్తికరమైన విషయాల్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు ప్రబాస్. ఆగస్ట్ 30న 'సాహో' వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. విడుదలకు ముందే బోలెడన్ని రికార్డుల్ని సొంతం చేసుకుంటోంది 'సాహో'. ఇక విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే, ప్రబాస్ ఆల్రెడీ 'జిల్' ఫేం రాధాక్రిష్ణ కాంబినేషన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోంది. ఇదో క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది.