అమీర్‌ఖాన్ నటించిన సినిమా 'దంగల్' రెండు వేల కోట్ల వసూళ్లని సాధించిందన్న సంగతి తెలిసిందే. అయితే అది పక్కాగా 2 వేల కోట్లు కాదట, 2 వేల కోట్లకు దగ్గరలో 'దంగల్' వసూళ్ళు ఆగిపోయాయని తాజా సమాచారమ్. 1864 కోట్ల దగ్గర 'దంగల్' వసూళ్ళు ఆగిపోయాయి. చైనాలో సినిమా విడుదల కావడంతోనే ఈ స్థాయి వసూళ్ళు వచ్చాయి 'దంగల్'కి. తెలుగు సినిమా 'బాహుబలి' ఈ సినిమాకి గట్టి పోటీనిచ్చింది. ఈ రెండు నువ్వా నేనా అనే రేంజ్‌లో వసూళ్లు సాధించాయి. అయితే చైనాలో 'దంగల్' విడుదలయ్యాక 'బాహుబలి' వసూళ్లు స్లో అయిన సంగతి తెలిసిందే. ఇంకా చైనాలో 'బాహుబలి' విడుదల కావాల్సి ఉంది. 'బాహుబలి' ముందు వరకూ 'దంగల్' సినిమానే బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా గుర్తింపు పొందింది. అయితే 'బాహుబలి' విడుదలయ్యాక ఈక్వేషన్స్ మారిపోయాయి. హిందీ సినిమా స్థాయిని మించి అనువాద సినిమా అయిన 'బాహుబలి' దూసుకెళ్లిపోయింది బాలీవుడ్‌లో. 'బాహుబలి' మేనియా చూసి, బాలీవుడ్‌లో కొందరు 'దంగల్' విషయంలో ఓవర్ సందడి చేశారు. అయితే నిజానికి 'దంగల్' 1864 కోట్ల దగ్గర ఆగిపోయింది. కానీ, 'బాహుబలి' చైనాలో విడుదలైతే కొద్ది రోజుల్లోనే 2 వేల కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిపోతుంది. ఇండియాలో 1000 కోట్లు సాధించిన తొలి సినిమా 'బాహుబలి'. ఇది మన తెలుగు సినిమా, ఇది ఇండియన్ సినిమా. ఇదీ మన ఇండియన్ సినిమా స్టామినా.