శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వరుణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఫిదా'. ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. అందులో ముఖ్య కారణం ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో వరుణ్ తేజ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. వరుణ్‌కి ఐదో చిత్రమిది. సినిమాలో చాలా మెచ్యూర్డ్‌గా కనిపిస్తాడట. ఇప్పటికే ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అలాగే ఈ సినిమాకి మరో మెయిన్ అట్రాక్షన్ హీరోయిన్ సాయి పల్లవి. ఆమెకి తెలుగులో ఇదే తొలి సినిమా అయినప్పటికీ, తమిళంలో 'ప్రేమమ్' సినిమాతో అమ్మడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నిలిచింది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు సినిమాలంటే అంత తక్కువగా అంచనా వేయలేము. ఆయన సినిమాల్లో ఫెయిల్యూర్స్ చాలా తక్కువని చెప్పొచ్చు. ఎందుకంటే, దిల్ రాజు సినిమాలకి చాలా లెక్కలుంటాయి. ఆయన తన సినిమాల్లో చాలా క్యాచీ పాయింట్స్‌ని యాడ్ చేసుకుంటూ ఉంటారు. అందుకే చాలా తొందరగా అందరికీ కనెక్ట్ అవుతూ ఉంటాయి ఆయన సినిమాలు. ఇటీవల 'శతమానం భవతి' సినిమాతో ఓ మంచి సినిమాని అందించారు. అలాగే మళ్లీ 'ఫిదా'తో అందర్నీ ఫిదా చేస్తానంటున్నారు. ఆహ్లాదమైన వాతావరణంలో సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చెబుతూనే, ఓ క్యూట్ లవ్‌స్టోరీకి వాటిని ముడిపెట్టి చూపిస్తూ ఉంటారు. సెన్సిటివ్ ఎమోషన్స్ సింపుల్‌గా రీచ్ అయ్యేలా ఉంటాయి దిల్ రాజు సినిమాలు. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురు చూస్తున్న మాట వాస్తవమే.