'నర్తనశాల'ను చుట్టుముట్టిన కొత్త వివాదం.!

By iQlikMovies - August 29, 2018 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

నాగశౌర్య హీరోగా తెరకెక్కుతోన్న 'ఎట్‌ నర్తనశాల' చిత్రం వివాదాలకెక్కింది. ఈ సినిమాలో నాగశౌర్య బృహన్నల పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌ ద్వారా ఆ పాత్ర తాలూకు కొన్ని సన్నివేశాలను కూడా చూపించారు. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

సరే తాజాగా హిజ్రాలు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆందోళనకు దిగారు. తమ మనోభావాలు దెబ్బ తినేలా ఏమైన సన్నివేశాలుంటే ఊరుకోమని ఫిలిం ఛాంబర్‌ వద్ద హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే ఈ మధ్య 'మనోభావాలు' పేరిట సినిమాలను వివాదాలు చుట్టుముట్టడం అనే ప్రక్రియ సర్వ సాధారణమైపోయింది. ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవనీ నాగశౌర్య చెబుతూనే ఉన్నాడు. 

'నర్తనశాల' అనే పేరుకు ఓ పవిత్రత ఉంది. ఆ పేరు చెడగొట్టే ప్రయత్నం చిత్ర యూనిట్‌ చేయలేదనీ, అలాంటప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బ తినే అవకాశం లేదనీ ఆయన చెబుతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ తరుణంలో, తాజాగా లేవనెత్తిన ఈ వివాదం విషయంలో చిత్ర యూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలిక. 

శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నాగశౌర్య హోమ్‌ బ్యానర్‌ అయిన ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందుతోంది. కష్మీరా, యామినీ భాస్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS