మన్మధుడంటే మన్మధుడే.!

By iQlikMovies - August 29, 2018 - 12:26 PM IST

మరిన్ని వార్తలు

ఈ రోజు నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'దేవదాస్‌'లోని నాగార్జున స్టిల్‌ని విడుదల చేస్తూ ఆయనకు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్‌ అందించింది చిత్ర యూనిట్‌. ఈ స్టిల్‌ చూసి అభిమానులు ఫుల్‌గా పండగ చేసుకుంటున్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి నిజంగానే ఈ స్టిల్‌ అద్దిపోయిందంతే. 

కౌబోయ్‌ గెటప్‌లా, డిటెక్టివ్‌ గెటప్‌లా ఉంది ఆ గెటప్‌. హ్యాట్‌, కళ్లజోడు, లాంగ్‌ కోటుతో మన్మధుడు ఇంతకు ముందు కన్నా హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో కిర్రాకు పుట్టించేస్తున్నాడు. బర్త్‌డేకి నాగార్జునకు చిత్ర యూనిట్‌ భలే గిఫ్ట్‌ ఇచ్చిందిలే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున డాన్‌ పాత్రలో కనిపించనున్నాడు ఈ సినిమాలో. 

స్టైలిష్‌ డాన్‌ పాత్ర అని ఈ మధ్య విడుదలైన టీజర్‌, తాజాగా విడుదలైన ఈ లేటెస్ట్‌ స్టిల్‌తో అర్ధమవుతోంది. 'మళ్లీరావా' ఫేం ఆకాంక్షసింగ్‌ నాగార్జునకి జోడీగా నటిస్తోంది. నేచురల్‌ స్టార్‌ నాని డాక్టరు పాత్ర పోషిస్తున్నాడు. నాగ్‌, నాని క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. రష్మికా మండన్నా నానికి జంటగా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS