ఈ మధ్యకాలంలో సినిమా పోస్టర్లకి సంబంధించి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పోయిన ఏడాది అర్జున్ రెడ్డి చిత్రానికి సంబందించిన పోస్టర్లు ఆర్టీసీ బస్సుల పైన అంటించడం వాటిపైన తీవ్ర అభ్యంతరం రావడంతో అప్పట్లో ఆ సినిమా పైన తీవ్ర ప్రభావం చూపింది.
సదరు చిత్ర దర్శకుడు, హీరో ఆ పోస్టర్ల గురించి వివరించే పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా రాహుల్ రవీంద్రన్ హీరోగా తెరకెక్కిన్న హౌరా బ్రిడ్జ్ చిత్రం ఎల్లుండి విడుదలకానుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం పబ్లిసిటీకి కొన్ని వాల్ పోస్టర్లు వేయడంతో ఇప్పుడు వాటికి అభ్యంతరం వ్యక్తమవుతున్నది.
ఎందుకంటే ఆ పోస్టర్స్ లో హీరో హీరోయిన్ చనువుగా ఉంటున్న పోస్టర్లు కావడంతో కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ పోస్టర్లు ఆర్టీసీ బస్సుల పైన అంటించడంతో ఆర్టీసీ కండక్టర్లు కూడా ఇటువంటి పోస్టర్లు బస్సుల పైన అంటించడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది అని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
మొత్తానికి ఈ సినిమా పోస్టర్ల అంశంతో ప్రేక్షకుల్లో మంచి పబ్లిసిటీ వస్తున్నది.