నటి అమలాపాల్ పైన ఒక వ్యక్తి లైంగికంగా వేధింపులకి పాల్పడిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం, చెన్నైలోని మంబాలం పోలీస్ స్టేషన్ లో అళగేశనన్ పై తనని లైంగికంగా వేధించాడు అని అమలాపాల్ ఫిర్యాదు చేసింది. తను త్వరలో మలేషియాలో మహిళాభివృది కొరకు జరిగే ఒక కార్యక్రమం కోసం టీ నగర్ లోని ఒక డాన్స్ స్కూల్ లో శిక్షణ పొందుతున్నట్టు ఆ సమయంలోనే ఈ అళగేశనన్ తనని లైంగికంగా వేధించాడు అని తెలిపింది.
ఆమె నుండి రాత పూర్వకంగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక గంట వ్యవధిలోనే అళగేశనన్ ని అదుపులోకి తీసుకోవడం ఆయన పైన మూడు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఇక ఈ అంశం పైన అమలాపాల్ మాట్లాడుతూ- సమాజంలో మహిళల పట్ల ఇటువంటి సంఘటనలు ఎక్కువ అయ్యాయి అని వీటిని నిరోధించడానికి అందరూ ప్రయత్నించాలి అని కోరింది.
మరి ఇతని ఈ కేసులో ఎటువంటి శిక్ష పడుతుందో అన్నది వేచి చూడాలి.