సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్ విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మాతలు బాగానే పబ్లిసిటీ చేశారు, ప్రిమియర్లు వేశారు. విడుదల తర్వాత ఆడవాళ్లు ఒక రోజు ఉచిత ప్రదర్శన వేశారు. కలెక్షన్స్ కూడా బావున్నాయని చెప్పారు.
అయితే ఇప్పుడీ సినిమాపై కాపీ మరక పడింది. బాలీవుడ్ సినిమా బరేలీ కి బర్ఫీ .. రైటర్ భూషణ్ పై మా సినిమా నుంచి కాపీ చేశారని ఆరోపించింది. కథలో జిస్ట్, కొన్ని సీన్లు కలుస్తున్నాయని, మూల కథని అటు ఇటుగా మార్చారు కానీ పాయింట్ మాత్రం అదేనని చెబుతున్నాయి. అయితే దీనిపై ఇంకా రైటర్ టీం స్పందించలేదు.