పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. పవన్ కల్యాణ్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ఈ సినిమాకి క్రిష్ దర్శకుడు. ఒక పక్క రాజకీయ పర్యటనల్ని కొనసాగిస్తూనే, మరోపక్క ఈ సినిమాని పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు పవన్‌కల్యాణ్. ఇప్పటికే షూటింగ్ కొంత ఆలస్యమైయింది. అయితే మహాశివ రాత్రి రోజున ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆశ గా ఎదురుచూశారు ఫ్యాన్స్.
కానీ ఆ ఆశలు ఫలించేలా కనిపించడం లేదు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వరకూ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ బయటికి ఇవ్వకూడదని నిర్మాత నిర్ణయించుకునట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ లుక్ టీజర్ బయటికి వచ్చింది. శివరాత్రికి మాత్రం అప్డేట్ వుండే ఛాన్స్ లేదు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్ ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.