కరోనా కారణంగా విదేశీ రాకపోకలు రద్దయిన సంగతి తెలిసిందే. ప్రపంచం స్థంభించిపోయింది. ఎక్కడివారక్కడే గప్ చుప్ అన్నట్లుగా, విదేశీ పర్యటనలు రద్దయిపోయాయి. విదేశీ రాకపోకల రద్ధు కారణంగా, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ఇక సినీ రంగమైతే, అల్లకల్లోలమైపోతోంది. ఎక్కడి షూటింగ్స్ అక్కడే నిలిపివేసేసి, ప్యాకప్ చెప్పేశారు ఫిలిం మేకర్లు. ఇకపోతే, టాలీవుడ్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’కి కరోనా గట్టి దెబ్బ కొట్టింది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ మూవీలో ఎక్కువ మంది విదేశీ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. విదేశీయల వీసాల్ని కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. దాంతో, ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో ముందుకు నడిచే ప్రస్థావనే లేదు.
ఈ ఏడాది జూలై 30న విడుదల కావల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ని వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్‌పోన్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ షెడ్యూల్‌పై అనూహ్యంగా వేటు పడింది. ఈ వేటును ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఎలా పూడ్చుకుంటుందో కానీ, ఈ సంగతి అటుంచితే, ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి కరోనా వైరస్‌పై స్పందించారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్వచ్చందంగా జాగ్రత్తలు పాఠిస్తే మంచిది.. అని పిలుపునిచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, ధియేటర్స్ పార్కులు మూసి వేసిన సంగతి విదితమే.