రైతు, వ్యవసాయం, పచ్చదనం.. ఇలా ఈ బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘శ్రీకారం’. యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ఈ సినిమాకి మూల కథ ఇదేనంటూ ఓ ప్రచారం చర్చకొచ్చింది. ఈ సినిమాని డైరెక్టర్ కిషోర్ డాక్యుమెంట్ రూపంలో మొదట ప్లాన్ చేశాడట. అయితే, ఎలాగో ఆ నోటా, ఈ నోటా శర్వానంద్ వద్దకు చేరిన ఆ నేపథ్యం శర్వానంద్ సినిమాకు కథగా మారిందనీ మాట్లాడుకుంటున్నారు.
కిషోర్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ, ఈ కథకు వెండితెర రూపం ఇచ్చేలా శర్వానంద్ ఆయనను ప్రోత్సహించాడనీ తెలుస్తోంది. అలా ఈ కథకు ‘శ్రీకారం’ చుట్టాడట శర్వానంద్. అసలింతకీ కథ ఏంటనేది కరెక్ట్‌గా తెలీదు కానీ, ఇటీవల రిలీజైన ‘శ్రీకారం’ ఫస్ట్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పచ్చని పొలాలు, ట్రాక్టర్‌పై శర్వా లుక్స్,, పంచెట్టు, తలకట్టుతో అచ్చమైన పల్లెటూరి కుర్రోడిలా కనిపిస్తూ ఆకర్షిస్తున్నాడు. 14 రీల్స్ పతాకంపై గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మాళవికా మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సమ్మర్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతోంది.