కరోనా చేసిన అల్ల కల్లోలం అంతా ఇంతా కాదు. పరిశ్రమలన్నీ... కరోనా ధాటికి దెబ్బతిన్నాయి. చిత్రసీమ గురించి చెప్పాల్సిన పనిలేదు. చిన్నా, పెద్దా తేడాలేకుండా నిర్మాతలంతా కరోనాకు బలయ్యారు. `ఆర్.ఆర్.ఆర్` కూడా ఇందుకు మినహాయింపు కాదు. బాహుబలి తరవాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్. బిజినెస్ పరంగా.. తిరుగు లేని కాంబినేషన్ ఇది. సినిమా మొదలవ్వకముందే... హాట్ కేక్ లా అమ్ముడుపోవాలి.
అయితే అనుకున్నంత ఊపు.. ఆర్.ఆర్.ఆర్ బిజినెస్ లో కనిపించడం లేదని టాక్. తెలుగులో అన్ని ఏరియాల నుంచి బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయినా.. తమిళనాడు, కేరళ, కర్నాటక నుంచి.. సరైన ఆఫర్లురావడం లేదని తెలుస్తోంది. ఇది వరకు అడ్వాన్సులు ఇచ్చినవాళ్లు సైతం ఇప్పుడు మిన్నకుండిపోయారట. బాహుబలికంటే... ఎక్కువ రేట్లకు ఈసినిమాని అమ్ముదామని చూస్తున్నారు నిర్మాతలు. అయితే అంత రేటుకి కొనడానికి ఎవరూ ఉత్సాహం చూపించడం లేదు. నార్త్ సైడ్ నుంచి కూడా మంచి రేట్లు రావడం లేదని తెలుస్తోంది.
ఉత్తరాదిన ఎన్టీఆర్, చరణ్‌లకు అంత క్రేజ్ లేదని, కేవలం రాజమౌళి సినిమా అనే స్టాంపుతోనే ఈ సినిమాని అమ్ముకోవాల్సివస్తోందని, దాంతో.. నిర్మాతలు ఆశించిన స్థాయిలో రేట్లు రావడం లేదని టాక్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ వస్తే తప్ప.. సినిమాలోని సత్తా ఏపాటితో ఎవ్వరికీ అర్థం కాదు. అప్పుడు జనం ఎగబడడం ఖాయం అని... చిత్రబృందం నమ్ముతోంది. పైగా.. ఆర్.ఆర్.ఆర్ విడుదలకు ఇంకా సమయం ఉంది. కాబట్టి.. బిజినెస్ పరంగా బెంగ అవసరం లేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.