థర్డ్ వేవ్ టెన్షన్ దేశమంతా... పాకేసింది. కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చిత్రసీమని కరోనా గడగడలాడిస్తోంది. మహేష్ బాబు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తను ట్వీట్ తో తెలియపరిచారు. మంచు లక్ష్మి, మంచు మనోజ్, తమన్, త్రిష, మీనా, విశ్వక్ సేన్, వరలక్ష్మీ శరత్ కుమార్.. ఇలా చాలామంది సినిమా సెలబ్రెటీలు కరోనా బారీన పడ్డారు. ఈరోజు.. సత్యరాజ్ కి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉందని టాక్. దాంతో... అభిమానులలో ఆందోళన మొదలైంది. ఇవన్నీ బయటకు చెప్పిన వాళ్ల పేర్లే. లోలోపల చెప్పని వాళ్లు ఎంతోమంది.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొంతమంది స్టార్ హీరోలు షూటింగులకు రామని చెప్పేస్తున్నార్ట. దాంతో.. షూటింగులు కూడా కాన్సిల్ అవుతున్నాయి. రెండు డోసులు తీసుకున్న వాళ్లనే సెట్లోకి అనుమతి ఇస్తున్నారని టాక్. రెండు డో్సులు తీసుకున్నా, బూస్టర్ డోస్ లేకపోతే... సెట్లోకి అనుమతించేది లేదని చెబుతున్నార్ట. దాంతో.. సినిమాపై ఆధారపడి జీవిస్తున్న లైట్ బోయ్స్, అసిస్టెంట్లు.. కంగారు పడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే త్వరలో షూటింగులన్నీ ఆగిపోతాయేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.