కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సినిమా రిలీజ్‌ల సంగతి సరే సరి. లాక్‌డౌన్ ఎత్తి వేశాక సినిమా షూటింగులు తిరిగి ప్రారంభమవ్వాల్సి వుంది. సినిమా దియేటర్ల విషయమై ఇప్పుడే ఓ క్లారిటీకి రాలేమన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడం కష్టమే. కానీ, హీరోయిన్ల పరిస్థితి అలా కాదు. ఒకేసారి నాలుగైదు సినిమాలు హీరోయిన్లు చేయడం కూడా చూస్తుంటాం. అలాంటివారికే కరోనా లాక్‌డౌన్ ఎత్తి వేత తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నాయి. డేట్స్ అడ్జస్ట్ చేయడం హీరోయిన్లకు అంత తేలిక కాదు.
మరోపక్క, ఏమాత్రం డేట్లు అడ్జస్ట్ కాకపోయినా, ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట తప్పదు దర్శక నిర్మాతలకి. కొత్త సినిమాల పరిస్థితి వేరు.. ఇప్పటికే షూటింగులు ప్రారంభమయిన సినిమాల సంగతి వేరు. షూటింగ్ ప్రారంభం కాని సినిమాలకు సంబంధించి హీరోయిన్లు ఖరారైనా అలాంటివారికి ‘చలనం’ తప్పకపోవచ్చట. అలా ఇప్పటికే పలువురు హీరోయిన్లకు షాక్ తగిలిందని చెప్పుకుంటున్నారు టాలీవుడ్‌లో. ఇందులో టాప్ ఫైవ్ లీగ్‌లో వున్న హీరోయిన్లకి కొన్ని పెద్ద బ్యానర్లు షాక్ ఇచ్చాయని అంటున్నారు.
కరోనా కష్ట కాలం అలాంటిది మరి. బడ్జెట్లు, రెమ్యునరేషన్లు కూడా తగ్గుతాయి. హీరోలు కూడా త్యాగాలకు సిద్ధపడక తప్పదు. ఏడాదికి రెండు సినిమాలు చేద్దామనే ప్లానింగ్‌లో వున్న హీరోలు, ఈ ఏడాది పూర్తిగా మిస్సయ్యే అవకాశాలూ లేకపోలేదు.