‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ లుక్ అందర్నీ విస్మయానికి గురిచేస్తోన్న విషయం విదితమే. ‘రంగస్థలం’ తరహాలో పూర్తిగా రగ్‌డ్ లుక్ మాత్రమే ఈ ‘పుష్ప’ అంతటా అల్లు అర్జున్ కన్పిస్తాడన్న ప్రచారం ఓ వైపు జరుగుతోంటే, ఇంకో వైపు.. ‘పుష్ప’ గురించి బోల్డన్ని కొత్త కథలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ‘పుష్ప’ సినిమా బ్యాక్‌డ్రాక్ ఎర్రచందనం స్మగ్లింగ్ అనీ, సినిమాలో కొంత భాగం అల్లు అర్జున్ స్టైలిష్ గెటప్‌లోనూ కన్పిస్తాడనీ, అదే ఈ సినిమాకి హైలైట్ కాబోతోందనీ కొత్త కథనం పుట్టుకొచ్చింది.
మరోపక్క సినిమాకి ‘శాడ్’ ఎండింగ్‌ని సుకుమార్ ప్లాన్ చేస్తే, అల్లు అర్జున్ దాన్ని మార్పించాడనీ, కొత్త క్లయిమాక్స్ దిశగా సుకుమార్ ‘కరోనా హాలీడేష్’లో కసరత్తులు చేస్తున్నాడనీ ఇంకో కథనం విన్పిస్తోంది. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ మాత్రం, ‘పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదనీ, సినిమాపై దర్శకుడు, హీరో, నిర్మాత.. మొత్తంగా టీమ్ అంతా ఓ క్లారిటీతో వుందని’ అంటోంది. సో, ‘పుష్ప’ టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా, పక్కా ప్లానింగ్‌తో వుందన్నమాట. పూర్తి ప్రిపరేషన్స్‌తో రంగంలోకి దిగింది ‘పుష్ప’ టీమ్. మరి ఈ కొత్త కొత్త కథనాలు, ఊహాగానాలు, పుకార్ల మాటేమిటి.? అంటే, ఇవన్నీ మామూలే కదా ఏ సినిమాకి అయినా అన్నది చిత్ర యూనిట్ వర్గాల వాదన.
సినిమా చాలా ద్రిల్లింగ్‌గా వుంటుందనీ, ఇంతవరకు తెలుగు తెరపై చూడని సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు.