ఈమధ్య సినిమా హిట్టయితే చాలు.. నిర్మాతలు సదరు దర్శకుడికీ, హీరోకీ ఖరీదైన కానుకలు ఇచ్చి.. తద్వారా తమ సంతోషాన్ని ప్రకటించేస్తున్నారు. తాజాగా బుచ్చిబాబుకీ ఓ ఖరీదైన కానుక దక్కింది. `ఉప్పెన`తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు లాభాల బాట పట్టారు. అందుకే బుచ్చికి మైత్రీ మూవీస్ ఓ ఖరీదైన కానుక ఇచ్చిందట.
ఈనెల 12న `ఉప్పెన` విడుదలైతే.. 15న తన పుట్టిన రోజు జరుపుకున్నాడు బుచ్చిబాబు. ఈ సందర్భంగా నిర్మాతలు బుచ్చికి ఓ కాస్ట్లీ కారుని బహుమతి గా ఇచ్చారని టాక్. అంతే కాదు.. మరో రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్సు కూడా చేతిలో పెట్టార్ట. దాంతో బుచ్చిబాబు కూడా ఖుషీ అయిపోతున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు తన రెండో కథ కి సంబంధించిన పనులు మొదలెట్టాడని, ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.